For Money

Business News

భారీ నష్టాల్లో SGX NIFTY

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను డాలర్‌ కుదిపేస్తోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తరవాత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 114వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరిన డాలర్‌ ఇప్పట్లో తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. అలాగే అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బాండ్స్‌పై ఈల్డ్స్‌ కూడా బాగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి బయటపడుతున్నారు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1.5 శాతంపైనే నష్టపోయాయి. ఇప్పటి వరకు ఐటీ, టెక్‌ షేర్లకే పరమితమైన పతనం ఇపుడు ఎకానమీ షేర్లలో కన్పిస్తోంది. వచ్చే త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎకనామీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. క్రూడ్‌ ఆయిల్ భారీగా క్షీణించడంతో ఎనర్జీ షేర్లు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ప్రారంభమయ్యాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా, కోస్పి, తైవాన్‌ మార్కెట్లు రెండు శాతం దాకా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 155 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి కూడా ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కావొచ్చు.