వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు
కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్ లీటర్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 2.41 రూపాయలు, డీజిల్‌పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్‌పై 2.48 రూపాయలు, డీజిల్‌పై 1,36 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ట్విట్టర్లో తెలిపారు. ఒడిసా ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 2.23, డీజిల్‌పై రూ.1.36 చొప్పున తగ్గించింది. మరి మన తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు.