30న స్టార్ హెల్త్ ఐపీవో
ప్రైవేట్ రంగ ఆరోగ్య బీమా దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఈ నెల 30న ప్రారంభం కానుంది. డిసెంబర్ 2తో ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 7,249 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించింది. షేర్ల ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. కనీసం 16 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేశారు. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వంటి దిగ్గజ ఇన్వెస్టర్లకు ఇందులో పెట్టుబడులు ఉన్నాయి.