For Money

Business News

శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ IPO… దరఖాస్తు చేయొచ్చా?

చెన్నైకి చెందిన శ్రీరామ్‌ గ్రూప్‌లోని నిర్మాణ రంగ సంస్థ శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది. 10న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించనున్నారు. మెజారిటీ షేర్లు ఆఫర్ ఫర్‌ సేల్ కింద అమ్ముతున్నారు. బ్లిక్‌ ఇష్యూలో రూ. 3 కోట్ల విలువ చేసే షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం రిజర్వు చేశారు. సిబ్బందికి 11 శాతం రాయితీ కూడా ఉంటుంది. డిసెంబరు 20న ఈ ఇష్యూ లిస్ట్‌ అయ్యే అవకాశముంది. ఒక్కో లాట్‌లో 125 షేర్లు ఉంటాయి. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. షేర్‌ రేంజ్‌ రూ.113 – రూ.118. భాగమైన ఈ సంస్థను 2000లో ప్రారంభించారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఇది. ఈ రంగంలో పోటీ ఎక్కువ. ఈ షేర్‌ పీఈ వ్యాల్యూయేషన్‌ కూడా ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువ. దీర్ఘకాలానికైతే దరఖాస్తు చేసుకోవచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నాయి. సెకండరీ మార్కెట్‌ మంచి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల షేర్లు లభిస్తుండగా…ఈ షేర్‌కు దరఖాస్తు చేయడం వేస్ట్‌ అని మరికొందరు అనలిస్టులు అంటున్నారు. ప్రస్తుతం అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌కు రూ. 20 ప్రీమియం లభిస్తోంది. కాని లిస్టింగ్‌ తేదీ వరకు ఈ ప్రీమియం ఉంటుందా అన్నది అనుమానమే. రిస్క్‌ వొద్దనుకునేవారు ఈ ఆఫర్‌ను వొదిలేయొచ్చు.