రేపు మార్కెట్లు పనిచేస్తాయి
ఈ ఏడాది రెండోసారి శనివారం నాడు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. సాధారణంగా మార్కెట్లకు శనివారం సెలవు. అయితే బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ (BCP)తో పాటు డిజాస్టర్ రికవరీ సైట్ (DRS) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా రేపు స్టాక్ మార్కెట్లో ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలని ఎక్స్ఛేంజీలు నిర్ణయించారు. స్పెషల్ ట్రేడింగ్ సెషన్లు రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు .. ఆ తరవాత 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షనలో ఉన్న సెక్యూరిటీల అప్పర్, లోయర్ బ్యాండ్లు 5 శాతానికి పరిమితం చేశాయి. అలాగే ఇవాళ కొనుగోలు చేసిన షేర్లు రేపు స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి లేదు. అలాగే రేపు పొజిషన్స్ తీసుకునే షేర్లు సోమవారం స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు.