For Money

Business News

భారీ లాభాల్లో నిఫ్టి

అమెరికా మార్కెట్ల ఉత్సాహానికి మన మార్కెట్లు స్పందించాయి. జపాన్‌ నిక్కీ రెండు శాతంపైగా పెరగడం, ఇతర ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉండటంతో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22100 స్థాయిని దాటింది. ఆరంభంలో 22047ను తాకిన నిఫ్టి వెంటనే కోలుకుని 22125 పాయింట్ల స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇపుడు 135 పాయింట్ల లాభంతో 22117 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి బ్యాంక్‌ 0.86 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 50 సూచీ 0.75 శాతం లాభంతో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 0.6 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి టాప్‌ 50లో మెటల్‌ కౌంటర్‌లు ముందున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్‌ షేర్లు రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇక అపోలో హాస్పిటల్స్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఒక శాతంపైగా షేర్‌ క్షీణించింది. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లలో అదానీ గ్రీన్‌, జొమాటో ముందున్నాయి. ఇక బెర్జర్‌ పెయింట్ ఇవాళ 4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చాలా వరకు బ్యాంక్‌ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి.