మరో మూడు రోజుల్లో నైరుతి వెనక్కి
దాదాపు మూడు వారాలు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభం కానుంది. సాధారణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఉంటుంది. ఈ ఏడాది 3 వారాలు ఆలస్యంగా మరో మూడు రోజుల్లో నైరుతీ రుతుపవనాల సీజన్ ముగుస్తుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. వాయువ్యం నుంచి ఇప్పటికే ఉపసంహరణ మొదలైందని పేర్కొంది. దీంతో ఈనెల 21-22 తేదీలో విదర్భ, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశముంది. 19-21 మధ్య ఒడిశా, ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్లో వర్షాలు పడే అవకావముందని తెలిపింది. దీని ప్రభావంగా పశ్చిమ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగడ్, ఢిల్లీలో రానున్న అయిదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది.