కాల్‌తో పాటు పేరు ప్రత్యక్షం
త్వరలోనే మీ ఫోన్‌కు వచ్చే కాల్‌తో పాటు అటువైపు ఎవరి నుంచి కాల్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ట్రూకాలర్ వంటి యాప్‌ల ద్వారా ఇపుడు అలాంటి సౌకర్యం ఉన్నా… అటువైపు నుంచి వచ్చన కాల్‌తో పాటు కనబడే పేరు కచ్చితంగా వారిదే లేదా అదే అని చెప్పలేం. ఎందుకంటే ట్రూకాలర్ తన డేటాను క్రౌడ్‌సోర్స్ ఆధారమైంది. కాని టెలికాం రెగ్యులటరీ అథారిటీ (ట్రాయ్) సిఫారసులు అమలైతే… కేవైసీ ద్వారా నిరూపితమైన పేర్లు కాల్‌తో పాటు ప్రత్యక్షమౌతాయి. వందశాతం వెరిఫై అయిన పేర్లతో వస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ పద్ధతిని ట్రాయ్ సిఫారసు చేయనుంది. అయితే కంపెనీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్ల గోప్యతకు విఘాతం కల్గుతుందని పేర్కొన్నాయి. అయితే ఈ అభ్యంతరాలను ట్రాయ్ పట్టించుకోవడం లేదు. ప్రతి ఫోన్ నవంబర్ కచ్చితంగా కేవైసీ ఆధారంగా ఇస్తున్నారు కాబట్టి… అదే డేటా ఆధారంగా కాల్‌తో పాటు పేరు ఉండాలని ట్రాయ్ అంటోంది. దీనివల్ల అసలు టెలికాం కంపెనీల వద్ద ఉన్న అన్ని ఫోన్ నంబర్లకు కేవైసీ ఉందో లేదో కూడా దీనివల్ల తెలిసిపోతుంది.