జీవీకేపై బ్యాంకుల కేసు
ఆస్ట్రేలియాలో బొగ్గు గనుల బిజినెస్ కోసం తీసుకున్న రుణాన్ని జీవీకే గ్రూప్ చెల్లించలేకపోయింది. రుణం ఇచ్చిన ఆరు బ్యాంకులు జీవీకే గ్రూప్‌పై కేసు వేశాయి. ఈ రుణం ఇపుడు రూ. 12,114 కోట్లకు చేరినట్లు బ్యాంకులు తెలిపాయి. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. జీవీకే గ్రూప్‌నకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్‌లు రుణం ఇచ్చాయి. 2011లో 100 కోట్ల డాలర్ల రుణం, 3.5 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను బ్యాంకుల నుంచి జీవీకే గ్రూప్ తీసుకుంది.2014లో మరో 16 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్)తో పాటు జీవీకే గ్రూప్‌నకు చెందిన 9 కంపెనీలు ఈ రుణం తీసుకున్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఆల్ఫా ప్రాజెక్టు కోసం ఈ రుణం తీసుకుంది జీవీకే గ్రూప్. అక్కడ పర్యావరణ వేత్తల ఆందోళన కారణంగా సదరు బొగ్గు ప్రాజెక్టుకు అనుమతులు రాలేదు.