For Money

Business News

నేడూ లాభాల్లో సింగపూర్‌ నిఫ్టి

నిన్న భారీ లాభాలతో తరవాత కూడా భారత స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కానున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్‌ 1.9శాతం పెరిగింది. ట్వీటర్‌లో ఎలాన్‌ మస్క్‌ 9.2 శాతం వాటా తీసుకోవడంతో ఆ కంపెనీ షేర్‌ 27 శాతం లాభంతో ముగిసింది. ఇతర టెక్‌ షేర్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, టెక్‌ కంపెనీల జోరుతో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా రాత్రి 0.81శాతం లాభపడింది.అయితే డౌజోన్స్‌ 0.3 శాతం లాభాలకే పరిమితమైంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిక్కీ మాత్రం నామ మాత్రపు లాభాల్లో ఉంది. ఎపుడైనా నష్టాల్లోకి జారిపోయే అవకాశముంది. అయితే కీలక మార్కెట్లు చైనా, హాంగ్‌కాంగ్‌లకు ఇవాళ సెలవు. ఇక సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. పెరుగుతున్న డాలర్‌, క్రూడ్‌ ధరలను మార్కెట్‌ ఇవాళ పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాలి.