For Money

Business News

NIFTY TODAY: ఓపెనింగ్‌లోనే ఒత్తిడి?

మార్కెట్‌ ఇవాళ కూడా లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా టెక్‌ మార్కెట్‌ను మన ఐటీ సూచీలు పట్టించుకోవడం లేదు. డాలర్‌ పెరుగుతున్నా ఇన్ఫోసిస్‌ వంటి టెక్‌ షేర్లు నష్టాల్లోనే ఉంటున్నాయి. నిన్న హెచ్‌డీఎఫ్‌ విలీనంతో మార్కెట్‌ భారీగా పెరిగింది. అయితే డాలర్‌ పెరగడంతో పాటు క్రూడ్‌ మళ్ళీ 110 డాలర్లకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18100 స్థాయిని దాటే అవకాశముంది. తొలి ప్రతిఘటన 18120-125 మధ్య రావొచ్చు. ఈ స్థాయి దాటితే 18177 వద్ద ఎదురు కానుంది. నిఫ్టి ఇపుడు ఓవర్‌బాట్‌ జోన్‌లోకి వచ్చేసింది. కాబట్టి కొనేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌
అప్‌ బ్రేకౌట్‌ 18320
రెండో ప్రతిఘటన 18245
తొలి ప్రతిఘటన 18196
నిఫ్టి కీలకం 17946
తొలి మద్దతు 17911
రెండో మద్దతు 17862
డౌన్‌ బ్రేకౌట్‌ 17788