సింగపూర్ నిఫ్టి అప్
అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.నాస్ డాక్ 3.33 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.47 శాతం, డౌజోన్స్ 1.76 శాతం చొప్పున లాభంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ 102 వద్ద ఉండగా, క్రూడ్ 120 డాలర్ల ప్రాంతంలో ఉన్నా.. .ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం విశేషం. అమెరికా మార్కెట్ల ఎఫెక్ట్ ఆసియా మార్కెట్లపై కన్పిస్తోంది. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా హాంగ్‌సెంగ్, జపాన్ నిక్కీ 1.98 శాతం చొప్పున లాభంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా లాభాలు తక్కువ. ఇతర మార్కెట్లు ఒక శాతం మేర లాభాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే సింగపూర్ నిఫ్టి 124 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం అవుతుందన్నమాట.