For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్‌ కొనసాగింది. నిన్న రాత్రి ఒక శాతం వరకు లాభాల్లో ఉన్న అమెరికా ఫ్యూచర్స్‌ ఇపుడు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం లాభంతో ఉంది. రాత్రి డాలర్‌ స్వల్పంగా తగ్గినా… డాలర్‌ ఇండెక్స్‌ 104పైనే ఉంది. ఇక క్రూడ్‌ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. జూన్‌ నెల ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌లు ఈ వారం క్లోజ్‌ కానున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్‌ 105 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా జపాన్‌ నిక్కీ 1.76 శాతం లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. తైవాన్‌, కోప్సీ, న్యూజిల్యాండ్‌ సూచీలు అర శాతం లాభంతో ఉన్నాయి. చైనా మార్కెట్లలో లాభాలు స్వల్పంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కేవలం 12 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి… ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.