For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లలో టెక్‌ షేర్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ పెరిగినా ఆ ఉత్సహం మన మార్కెట్‌లో ఉంటుందా అన్నది చూడాలి. అమెరికా మార్కెట్లకు భిన్నంగా ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు జోష్‌ మీద ఉన్నాయి. ఇవాళ వచ్చిన చైనా ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటమే దీనికి కారణం. సూచీలు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. దీంతో మెటల్స్‌ మళ్ళీ పుంజుకుంటాయా అన్నది చూడాలి. జపాన్‌ నిక్కీ మాత్రం స్వల్ప లాభాలకే పరిమితమైంది. నాస్‌డాక్‌ 30 శాతం క్షీణించడంతో దిగువన మద్దతు లభిస్తోంది. చైనా, హాంగ్‌కాంగ్‌ లోకల్‌ డేటాతో స్పందిస్తున్నాయి. మరి మన మార్కెట్లు స్పందించడానికి ఏమీ లేదు. మెటల్‌, ఐటీలో మద్దతు వస్తే సూచీలు పెరగవచ్చు. సింగపూర్‌ నిఫ్టి క్రితం ముగింపు వద్ద స్థిరంగా ఉంది. చూస్తుంటే నిఫ్టి కూడా ఒక మోస్తరు లాభాలతో లేదా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.