స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి గ్రీన్లోఉన్న నాస్డాక్ 1.58 శాతం లాభంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.59 శాతం లాభపడింది. ఆరంభంలో నష్టాల్లో ఉన్న డౌజోన్స్ చివర్లో కోలుకుని స్వల్ప లాభాలతో అంటే 0.15 శాతం లాభంతో ముగిసింది. ఇతర మార్కెట్లలో పెద్ద మార్పులేదు. డాలర్ 107 ప్రాంతంలో ముగిసింది. అలాగే క్రూడ్ ధరల్లో కూడా పెద్ద మార్పు లేదు. అయితే బంగారం అత్యంత కీలక మద్దతు స్థాయి 1700ని కోల్పోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కాకపోతే కొన్ని మార్కెట్లు నామ మాత్రపు నష్టాలతో ఉండగా చైనా హాంగ్ కాంగ్ మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి క్రితం ముగింపు వద్దే ఉంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది.