For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

ఊహించినట్లే రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ఉన్న మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. ముఖ్యంగా భారీ నష్టా్లలో ఉన్న డౌజోన్స్‌ 0.7 శాతం లాభంతో ముగిసింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.57 శాతం లాభూపడింది. ట్విటర్‌తో పాటు పలు టెక్‌, ఐటీ షేర్లు రాత్రి ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.29 శాతం లాభపడింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లోఉన్నాయి. పెరుగుతున్న కోవిడ్‌ కేసుల నేపథ్యంలో నిన్న భారీ నష్టాలతో ముగిసిన హాంగ్‌సెంగ్‌ సూచీ 0.74 శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాలతో ఉన్నాయి. ఇక జపాన్‌ నిక్కీ 0.7 శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.