లాభాల్లో సింగపూర్ నిఫ్టి
నిన్నటి భారత పతనం మార్కెట్లు ఇవాళ గ్రీన్లో ప్రారంభం కానున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలున్నా… క్రమంగా బలపడుతూ వచ్చాయి. నాస్డాక్ చాలా రోజుల తరవాత 2 శాతంపైగా లాభంతో ముగిసింద.ఇ ఎస్ అండ్ పీ 500 సూచీ, డౌజోన్స్ కూడా ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. రాత్రి క్రూడ్ ఆయిల్ భారీగా క్షీణించడం పాజిటివ్ అంశం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లను ఫాలో అయ్యే మార్కెట్లు గ్రీన్లో ఉండగా.. చైనా, హాంగ్కాంగ్ నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంల సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల లాభంతో ఉంది.