నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
అంతర్జాతీయంగా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లలో నాస్డాక్ 2 శాతంపైగా నష్టంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.3 శాతం నష్టపోయింది. డౌజోన్స్ 0.69 శాతం క్షీణించింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. జపాన్, ఆస్ట్రేలియా గ్రీన్‌లో ఉండగా చైనా,
హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఇవాళ కూడా మరో మూడు శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్ల నష్టాలు ఒక శాతంపైగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం వంద పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. మరి దిగువస్థాయిలో మద్దతు లభిస్తుందా అన్న అంశాలలను NIFTY TODAY రివ్యూలో చదవగలరు.