నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగివాయి. నిజానికి అమెరికా రీటైల్ ద్రవ్యోల్బణ డేటా రానుంది. దీని కోసం ప్రపంచ మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. రాత్రి సూచీల్లో పెద్ద మార్పు లేదు. అన్నీ నామ మాత్రపు నష్టాలతో ముగిశాయి. డాలర్, బాండ్ ఈల్డ్స్ కూడా స్థిరంగా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 113పైనే ఉంటోంది. ఇక క్రూడ్ ధరలు రాత్రి బాగా క్షీణించాయి. ఇపుడు 93 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ అర శాతం నష్టంతో ట్రేడవుతుండగా, హాంగ్‌సెంగ్ మాత్రం 0.2 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు కాస్త ఒత్తిడి కన్పిస్తోంది. షాంఘై స్వల్ప నష్టంతో ఉన్నా చైనా ఏ50 సూచీ 0.9 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 55 పాయింట్ల నష్టంతో ఉంది. ఇవాళ నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది.