For Money

Business News

ఫుల్‌ జోష్‌లో ఈక్విటీ మార్కెట్లు

ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచిన తరవాత ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ రెండు శాతం దాకా లాభపడింది. అనేక ఐటీ, టెక్‌ షేర్లు ఆకర్షణీయ లాభాలు గడించాయి. ఈ షేర్లలో వచ్చిన ర్యాలీతో ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.13 శాతం లాభపడింది. ఇక డౌజోన్స్‌ కూడా 0.74 శాతం లాభపడింది. బ్యాంక్‌ షేర్లతో పాటు ఎనర్జీ షేర్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే జోష్‌. నిన్న రెండు శాతం లాభపడిన జపాన్‌ నిక్కీ ఇవాళ 2.58 శాతం లాభంతో ట్రేడవుతోంది. రాత్రి చైనా కంపెనీ జేటీఏకు అనుకూలంగా అమెరికా తీర్పు ఇవ్వడం, ఆలీబాబ్‌ బైబ్యాక్‌ ఆఫర్‌తో చైనాకు చెందిన అనేక టెక్‌ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ ఇపుడు 1.26 శాతం లాభంతో ట్రేడవుతోంది. న్యూజిల్యాండ్ వినా అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 65 పాయింట్ల లాభంతో ఉంది. సో… మన మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది.