సింగపూర్ నిఫ్టి నష్టాల్లో
మొన్న రాత్రి నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రారంభమైన పతనం ఇవాళ కూడా కొనసాగుతోంది. మొన్న రెండు శాతం, నిన్న రాత్రి మరో రెండు శాతం నాస్డాక్ నష్టపోయింది. ఇతర అమెరికా సూచీలు కూడా నష్టాల్లో కొనసాగాయి. అలాగే నిన్న ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్ల పతనం ఇవాళ కూడా ఆసియా మార్కెట్లలో కొసాగుతోంది. హాంగ్‌సెంగ్ దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. జపాన్ నిక్కీ 1.85 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు నామ మాత్రంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ ఒక శాతం వరకు నష్టంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. సో… నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది.