For Money

Business News

షేర్‌ మార్కెట్‌ ఇవాళ రక్తపాతం

2020, 2021లలో కరోనా స్టాక్‌ మార్కెట్లకు కనక వర్షం కురిపిస్తే… 2022 ఇన్వెస్టర్లకు పీడకలగా మారనుంది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం వెంటనే ఆగకపోతే… స్టాక్‌ మార్కెట్లలో భారీ పతనం తప్పేలా లేదు. ఇప్పటికే స్వల్ప కాలీనా షేర్‌మార్కెట్‌ భారీగా దెబ్బతింది. అనేక షేర్లు 40 శాతం నుంచి 50 శాతం తగ్గాయి. సూచీ ప్రధాన షేర్లు గ్రీన్‌లో ఉన్నట్లు కన్పిస్తున్నా… నాన్‌ నిఫ్టి షేర్లలో పతనం చాలా జోరుగా ఉంది. ముఖ్యంగా క్రూడ్‌ ఆధార పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అలాగే బొగ్గు వంటి ఖనిజాలను ముడి పదార్థాలుగా వాడుతున్న కంపెనీల పనితీరు కూడా భారీగా దెబ్బతినే అవకాశముంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో క్లోజ్‌ కాగా, ఇవాళ ఫ్యూచర్స్‌ 1.5 శాతం నష్టంతో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో రక్తపాతం కొనసాగుతోంది. నిక్కీ, హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ సూచీలు మూడు శాతంపైగా నష్టపోయాయి. చైనా కూడా రెండు శాతం నష్టపోయింది. సింగపూర్‌ నిఫ్టి 400 పాయింట్లు అంటే 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అంటే ఇవాళ నిఫ్టి ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.