For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్‌ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి మన మార్కెట్లలో కూడా కన్పిస్తోంది. ముఖ్యంగా ఐటీ, టెక్‌ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 100 దాటినా.. మన కంపెనీలకు పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఆర్బీఐ రూపాయిని కాపాడే ప్రయత్నంలో డాలర్లను అమ్ముతోంది. అయితే కరెంట్‌ అకౌంట్‌ భారీగా ఉన్న నేపథ్యంలో ఇవాళ కాకపోయినా.. రేపైనా రూపాయి పతనకం కావడం ఖాయం. కాని ప్రస్తుతానికి అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం ఐటీ కౌంటర్లకు కష్టంగా ఉంది. అయితే డాలర్‌ పెరగడం వల్ల ఎగుమతి ప్రధాన ఫార్మా కంపెనీలదీ ఇదే పరిస్థితి. అయితే ఫార్మా కౌంటర్లలో పెద్దగా ఒత్తిడి లేదు. ఇక ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా వైదొలగుతున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు కొటక్‌ బ్యాంక్‌పై ఈ ప్రభావం బాగా కన్పిస్తోంది. అమెరికా పతనం నేపథ్యంలో జపాన్‌ నిక్కీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ కూడా. అయితే చైనాతో పాటు హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. అయితే ఇవి నామమాత్రమే. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ వారం మార్కెట్‌ కేవలం మూడు రోజులే ఉంటోంది. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. కాబట్టి మార్కెట్‌లో హెచ్చుతగ్గులు అధికంగా ఉండనున్నాయి.