For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

అమెరికా మార్కెట్ల ప్రభావం భారత్‌ మార్కెట్లపై తీవ్రంగా ఉంటోంది. అమెరికాతో పోలిస్తే ప్రతిరోజూ నష్టాలు తక్కువగా ఉన్నా…రోజూ మన మార్కెట్లు బలహీనపడుతున్నాయి. నిన్న 16000 దిగుకు వెళ్ళి.. వచ్చిన నిఫ్టి ఇవాళ 16000 దిగువన ఓపెన్‌ అయ్యే అవకాశం కన్పిస్తోంది.ఆసియా మార్కెట్లలో చైనాకు సెలవు. అమెరికాతో పోలిస్తే ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.82 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ ఒక శాతం నష్టంతో ఉంది.ఇతర మార్కెట్లు అర శాతం నష్టంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.