For Money

Business News

వాల్‌స్ట్రీట్‌ పతనం ఆగేలా లేదే…

నిన్న వెలువడిన వినియోగదారుల ధరల సూచీ (CPI) అమెరికా మార్కెట్లను కుదిపేసింది. చిత్రం ఒక శాతం లాభంతో ప్రారంభమైన నాస్‌డాక్‌ చివరకు 3.18 శాతం నష్టంతో ముగిసింది. CPI స్వల్పంగా తగ్గినా… ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతోంది. ముఖ్యంగా ఇంధన ధరలు, ఆహార వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యల్బోణంపై ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి డౌజోన్స్‌ ఒక శాతం నష్టపోగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.65 శాతం నష్టంతో ముగిసింది. నిన్న తగ్గినట్టే కన్పించిన డాలర్.. క్లోజింగ్‌ కల్లా పుజుకుంది. ఇవాళ 104ను డాలర్‌ ఇండెక్స్‌ దాటేలా ఉంది. రాత్రి క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరిగినా… క్లోజింగ్‌ కల్లా తగ్గిపోయింది. ఇపుడు బ్రెంట్‌ క్రూడ్‌ 107 డాలర్ల ప్రాంతంలో ఉంది.