రూ. 2200 తగ్గిన వెండి
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. డాలర్ ఇవాళ కూడా పెరగడంతో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా వెండి ఇవాళ అయిదు శాతంపైగా క్షీణించింది. మన మార్కెట్‌లో అంటే ఎంసీఎక్స్‌లో వెండి ఆగస్టు కాంట్రాక్ట్ ఇవాళ రూ. 2200 తగ్గి రూ. 55285కు పడిపోయింది. ఇవాళ వెండి గరిష్ఠ స్థాయి రూ. 57450. వెండి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 73701 కాగా, ఇవాళ 52 వారాల కనిష్ఠ స్థాయి అంటే రూ. 55285కు పడిపోయింది. ఇపుడు స్వల్పంగా కోలుకుని రూ. 55,562 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం కూడా ఇవాళ దాదాపు రూ. 600పైనే పడింది. ఉదయం రూ. 50729 పలికిన ఆగస్టు కాంట్రాక్ట్ రూ. 50,067కు క్షీణించింది. ప్రస్తుతం రూ. 50185 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1704 డాలర్ల కనిష్ఠ స్థాయికి చేరింది. ఒకదశలో 17000 డాలర్ల దిగువకు కూడా చేరింది.