సిగాచీ బంపర్ లిస్టింగ్
మైక్రోక్రిస్టలిన్ సెల్యూలోజ్ ఉత్పత్తి చేసే సిగాచీ ఇండస్ట్రీస్ షేర్లు ఇవాళ స్టాక్‌ఎక్స్ఛేంజీ లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ.163లకు ఇన్వెస్టర్లకు అలాట్ చేయగా, ఇవాళ ఆ షేర్ 252.76 శాతం అధికంగా రూ.575 వద్ద లిస్ట్ అయింది. అనధికార మార్కెట్లో రూ. 100 ప్రీమియంతో ట్రేడైన ఈ షేర్.. .లిస్టింగ్ రోజు మరింత లాభం ఆర్జించడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చింది. సిగాచీ పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్‌కు 90 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.163 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.14,490కాగా, ఇవాళ్టి రూ.575ల లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్‌కు రూ.51,300పైగా గిట్టుబాటు అయింది.