NIFTY TRADE: 17100 దాటకపోతే
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓపెనింగ్‌లోనే నిఫ్టిని షార్ట్ చేయొద్దని స్టాక్ మార్కెట్ డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టి 17110 స్థాయిని దాటకపోతే నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మొచ్చని ఆయన అంటున్నారు. నిఫ్టి 17100 నుంచి 17500 వరకు భారీ కాల్ రైటింగ్ ఉన్నందున.. డెరివేటివ్స్ క్లోజింగ్స్ ఉన్నందున డే ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టి గనుక 17110 స్థాయిని దాటితే 17166 స్థాయికి చేరొచ్చని అంటున్నారు. 17110 వద్దే ఒత్తిడికి లోనైతే నిఫ్టిని షార్ట్ చేయమని సలహా ఇస్తున్నారు. నిఫ్టి బలహీనంగా ఉంటే… డెరివేటివ్స్ క్లోజింగ్లోగా 16805 దాకా పడే అవకాశముందని ఆయన అంటున్నారు. నిఫ్టికి 17010 లేదా 16936 ప్రాంతంలో మద్దతు లభింవచ్చని వీరేందర్ భావిస్తున్నారు. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=SzPDCdCjLR4