ఈ రెండు షేర్లలో షార్ట్ కవరింగ్!
మార్కెట్‌లో అనూహ్యంగా వచ్చిన భారీ ర్యాలీ కారణంగా అనేక షేర్లలో షార్ట్ కవరింగ్ వస్తోంది. ఇప్పటికే జేకే సిమెంట్, అపోలో హాస్పిటల్స్‌లో ఈ తరహా షార్ట్ కరింగ్‌తో ఆ షేర్లు బాగా లాభపడ్డాయి. జూబ్లియంట్ ఫుడ్స్‌లో కూడా ఇదే తరహా షార్ట్ కవరింగ్ రావొచ్చని అనలిస్టులు అంటున్నారు. ఈ షేర్‌లో ఇటీవల భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. జూబ్లియంట్ ఫుడ్స్, టాటా కమ్యూనికేషన్స్‌లో షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ ఉందని అనలిస్టలు అంటున్నారు.