For Money

Business News

ల్యాంకో ప్లాంట్‌పై రిలయన్స్‌ కన్ను

రిన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులతో వస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌… బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను కూడా టేకోవర్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా చత్తీస్‌ఘడ్‌లో ల్యాంకో గ్రూప్‌ నెలకొల్పిన అమకంటక్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం బిడ్ దాఖలు చేసింది. రుణాల చెల్లింపులో విఫలమైన ల్యాంక్‌ కంపెనీ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌ కోసం ఇప్పటికే అదానీ పవర్, జిందాల్ పవర్, పీఎఫ్‌సీ- ఆర్ఈసీ -ఎన్టీపీసీల కన్సార్షియమ్‌ కూడా బిడ్‌లు వేశాయి . ఆర్ఎఐఎల్ పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో 1000 కోట్ల డాలర్ల ( రూ .75,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. ఇప్పుడు థర్మల్ విద్యుత్తు ప్లాంటు పైనా ఆసక్తి చూపుతోంది. చత్తీస్‌ఘడ్‌లోని కోరబ్‌ వద్ద 1337 ఎకరాల్లో ల్యాంక్‌ తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. బ్యాంకులకు రూ. 14,632 కోట్లు చెల్లించాల్సి ఉంది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే విద్యుత్ డిమాండ్‌ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.