పెరుగుతున్న రీటైల్ ఇన్వెస్టర్ల వాటా
గత ఆర్థిక సంవత్సరంలో (2020-21)లో సగటున ప్రతి నెలా 12 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. అంత క్రితం ఏడాదిలో ఇవి కేవలం 4 లక్షలు మాత్రమేకాగా.. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వస్తే ఇప్పటి వరకు 26 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది డేటాను చూస్తే క్రమంగా రీటైల్ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతోంది. 2020–21కల్లా క్యాష్ సెగ్మంట్లో రోజువారీ టర్నోవర్లో రీటైల్ ఇన్వెస్టర్ల వాటా 39 శాతం నుంచి 45 శాతానికి పెరిగింది. లిస్టెడ్ కంపెనీలలో కూడా వీరి వాటా 9.3 శాతానికి చేరింది. గ్లోబల్ గణాంకాల సంస్థ స్టాటిస్టా వివరాల ప్రకారం అమెరికాలో సుమారు 55 శాతం పెద్దలు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లకు మళ్లిస్తుంటారు.