ASIA REVIEW: స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా… ఓ మోస్తరు నష్టాలకే పరిమితం అయ్యాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ దాదాపు స్థిరంగా క్రితం ముగింపు వద్దే ముగిసింది. నాస్డాక్ 0.4 శాతం నష్టపోగా, డౌజోన్స్ 0.58 శాతం నష్టపోయింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. తైవాన్, సింగపూర్, న్యూజిల్యాండ్ మార్కెట్లు నష్టాల్లో ఉండగా… ప్రధాన మార్కెట్లు మాత్రం లాభాల్లో ఉన్నాయి. నిన్న పనిచేయని జపాన్ నిక్కీ ఇవాళ ఆరంభంలోనే 1.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్ కూడా 0.85 శాతం లాభం ఉంది. ఇక చైనా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు సింగపూర్ నిఫ్టి 25 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. 140 రోజుల తరవాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో… మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.