For Money

Business News

సింగపూర్ నిఫ్టి 370 పాయింట్లు అప్‌

రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తలతో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా దెబ్బతిన్న మార్కెట్లలో భారీ ర్యాలీ వస్తోంది. యూరప్‌ మార్కెట్లలో ప్రధాన మార్కెట్లన్నీ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్‌ 2.6 శాతం లాభంతో ఉంది. ఇక యూరో మార్కెట్ల ట్రెండ్‌ను ప్రతిబింబించే యూరో స్టాక్స్‌ 50 సూచీ 2.65 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక క్రూడ్‌ ఆయిల్‌ మూడు శాతం క్షీణించింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 106.5 డాలర్లకు పడిపోయింది. డాలర్ కూడా భారీగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అనేక భారత కంపెనీలు ముడిపదార్థాల వ్యయం పెరిగిందని లబోదిబో మంటున్నాయి. తాజా వార్త భారత మార్కెట్‌కు శుభవార్తే. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 370 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. రేపు ఉదయం వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగే పక్షంలో రేపు నిఫ్టి రెండు శాతం లాభంతో ప్రారంభం కానుంది. ఎల్లుండి అంటే గురువారం వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో… రేపు భారీ షార్ట్‌ కవరింగ్‌కు ఛాన్స్‌ ఉంది.