For Money

Business News

కుప్పకూలిన బంగారం, వెండి

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు ఫలవంతమౌతున్నాయని వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా బాగా నష్టపోయిన యూరో మార్కెట్లలో షేర్ల సూచీలు దౌడుతీస్తున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఒక శాతం నష్టపోయింది. చిత్రం డాలర్‌తో పాటు బులియన్‌ కూడా భారీగా క్షీణించింది. డాలర్‌ గనుక క్షీణించకపోయి ఉంటే… భారత్‌లో బులియన్‌ పతనం మరీ భీకరంగా ఉండేది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1.55 శాతం క్షీణించి 1909 డాలర్లకు చేరగా, 2.3 శాతం నష్టంతో వెండి 24.59 డాలర్లకు చేరింది. డాలర్‌ ఇండెక్స్‌ 98.29కి పడిపోయింది. దీంతో మల్టి కమాడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో బులియన్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం ఏప్రిల్ నెల కాంట్రాక్ట్‌ రూ. 806 క్షీణించి రూ.51,200 వద్ద ట్రేడవుతోంది. కొద్దిసేపటి క్రితం 50,775కి కూడా పడిపోయింది. ఇక కిలో వెండి ధర (ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌) రూ.1565 క్షీణించి రూ. 66,540కి తగ్గింది. ఈ రాత్రికి డాలర్ ఏ కాస్త బలపడినా.. బులియన్‌ ధరలు మరింత క్షీణించే అవకాశముంది.