ఓఎన్‌జీసీ OFS రేపు
కరెక్ట్ టైమ్. మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయో లేదు. ఇటీవల భారీగా పెరిగినందున దేశీయంగా ఓఎన్‌జీసీ షేర్ కూడా బాగా పెరిగింది. ఇదే అదనుగా ఈ కంపెనీలో 1.75 శాతం ఈక్విటీని అంటే 9.43 కోట్ల షేర్లను అమ్మాలని (ఆఫర్ ఫర్ సేల్ – OFS) భారత ప్రభుత్వం నిర్ణయించింది. రేపు అంటే బుధవారం ఒక్కో షేర్‌ను రూ. 159 చొప్పున ఆఫర్ చేయనుంది. ఈ ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ. 3000 కోట్లు సమకూరుతాయని ప్రభుత్వ అంచనా. ఇవాళ ఓఎన్‌జీసీ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 3.03 శాతం నష్టంతో రూ. 171 వద్ద ముగిసింది. అంటే రూ.12 డిస్కౌంట్‌తో రేపు ఆఫర్ చేయనుంది.ఆ మేరకు షేర్ రేపు పతనం కావడం ఖాయమన్నమాట.