భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి
నిన్నటి భారీ పతనం తరవాత ఇవాళ మార్కెట్ల ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది.రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మూడు సూచీలు అర శాతం మేర నష్టాలతో ముగిశాయి. నష్టాల జోరు తగ్గడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. మరోవైపు చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో… అక్కడి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధాన సూచీలన్నీ ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి.ఒక హాంగ్‌సెంగ్ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. జపాన్, ఇతర మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది.సో… నిఫ్టికి ఓపెనింగ్‌లో గట్టి మద్దతు లభిస్తోందన్నమాట.