For Money

Business News

చైనా ‌… వడ్డీ రేట్లను తగ్గించింది

అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో వడ్డీ రేట్లను పెంచుతున్నారు. పలుదేశాల్లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి చైనా తమ దేశంలోని పలు కంపెనీలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌, టెక్‌ కంపెనీలపై విధించిన ఆంక్షలతో వృద్ధి రేటు మందగించింది. కరోనా కారణంగా అనేక ప్రధాన నగరాల్లో వాణిజ్య లావాదేవీలు క్షీణించాయి. కంపెనీలకు అనుకూలంగా పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లను తగ్గించింది. మార్కెట్‌ విశ్లేషకులు… వడ్డీ రేట్ల తగ్గింపు 0.05 లేదా 0.10 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. అయితే చైనా కేంద్రం బ్యాంక్‌ వడ్డీ రేట్లను 0.15 శాతం తగ్గించింది.దీంతో వడ్డీ రేట్లు 4.6 శాతం నుంచి 4.45 శాతానికి క్షీణించాయి. అయితే ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లలో మార్పు చేయలేదు. చైనాలో ఏడాదికి వడ్డీ రేటు 3.7 శాతం.