For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు చాలా సానుకూలంగా ఉన్నాయి. రాత్రి అమెరికా, ఇపుడు ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌ 1.67 శాతం, డౌజోన్స్‌ 1.41 శాతం, డౌజోన్స్‌ 0.98 శాతం లాభంతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో కూడా ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. దాదాపు అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం వరకు లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ కూడా 0.77 శాతంతో ట్రేడవుతోంది. ఇతర మార్కెట్లన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా 106 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుందన్నమాట.