భారీ లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు ఊహించినట్లే నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చాయి. నిన్న ఆరంభం నుంచి అర శాతం పైగా నష్టాల్లో ఉన్న సూచీలు చివర్లో కోలుకున్నాయి. డాలర్ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరినా.. మార్కెట్లు నిలదొక్కుకోవడం విశేషం. డౌజోన్స్ 0.23 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం నాస్డాక్ 0.35 శాతం లాభంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గినా 107కు చేరువలో ఉంది. ఇక క్రూడ్‌లో పతనం కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల లోపునకు వచ్చేసింది. హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.8 శాతం లాభంతో ఉంది. కోస్పి, తైవాన్ మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి.ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16000ను దాటే అవకాశముంది.