భారీ లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. ఫెడ్ ఇవాళ, రేపు సమావేశం కానుంది. వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో డాలర్, ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో రాత్రి మూడు ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే డౌజోన్స్ నష్టాలు కేవలం 0.39 శాతానికే పరిమితం కాగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.75 శాతం నష్టపోయింది. ఇక నాస్‌డాక్ కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. రాత్రి ఒక మోస్తరు క్షీణించిన క్రూడ్ ఆయిల్ ఇవాళ మళ్ళీ జోరుమీద ఉంది. వరుస భారీ నష్టాల తరవాత చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ఉన్నాయి. చైనా సూచీలు ఒక శాతం నుంచి రెండు శాతం లాభపడగా, హాంగ్‌సెంగ్ 4 శాతం లాభంతో ట్రేడవుతోంది. అమెరికా అమెరికాతో ముడిపడిన ఆసియా మార్కెట్లు మాత్రం డల్‌గా ఉన్నాయి. జపాన్ నిక్కీ కేవలం 0.18 శాం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. సో… ఇవాళ నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.