స్వల్పలాభంలో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 1.5 శాతం నుంచి ఒక శాతానికి క్షీణించగా, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీల లాభాలు ఒక శాతం నుంచి అర శాతానికి తగ్గాయి. రాత్రి డాలర్ స్వల్పంగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 110 దిగువనే ఉంది. రాత్రి క్రూడ్ కూడా బాగా క్షీణించింది. ఇవాళ 96 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మర్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. తైవాన్ మార్కెట్ ఒక్కటే ఒక శాతం లాభంతో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్, చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.
