ఓపెనింగ్‌లోనే దుమ్ము రేపనున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నాస్డాక్ ఏకంగా మూడు శాతంపైగా లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.76 శాతం లాభంతో ముగిసింది.ఇక డౌజోన్స్ కూడా 2.43 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్ స్వల్పంగా తగ్గింది. ముఖ్యంగా కార్పొరేట్ ఫలితాలు, వడ్డీ రేట్ల పెంపు సాధారణంగా ఉంటుందన్న వార్తలతో మార్కెట్లు భారీ లాభాలతోముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అన్ని మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. చైనా మినహా అన్ని మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. జపాన్ నిక్కీ 2.35శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి ఏకంగా 180 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే భారీగా లాభపడనుంది.