భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి
గత వారాంతంలో ఈక్విటీ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. మన మార్కెట్ల తరవాత యూరో మార్కెట్లు రెండు శాతం దాకా లాభంతో ముగిశాయి. ఆ తరవాత ఇదే ట్రెండ్ అమెరికా మార్కెట్లలో కన్పించింది. ముఖ్యంగా గ్రోత్ షేర్లలో వచ్చిన ర్యాలీ కారణంగా డౌజోన్స్ ఏకంగా రెండు శాతంపైగా లాభపడింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.92 శాతం లాభంతో ముగిసింది. అదే ధోరణితో 1.79 శాతం లాభపడింది నాస్డాక్. డాలర్ స్వల్పంగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ 108 దిగువకు వచ్చింది. ఇక క్రూడ్ధరలు ధరలు రెడ్‌లో ఉన్నా.. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల పైనే ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఇవాళ జపాన్ మార్కెట్లకు సెలవు. హాంగసెంగ్ 0.8 శాతం లాభపడగా చైనా మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. మిగిలిన మార్కెట్లు అరశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి150 పాయింట్లకు పైగా లాభంతోట్రేడవుతోంది. సో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16200 స్థాయిని దాటుతుందేమో చూడాలి.