భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు పరుగులు తీశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకు అడ్డుకట్ట పడటంతో రాత్రి డాలర్ భారీగా క్షీణించింది. ఇక వడ్డీ రేట్ల పెంపు జోరుగా ఉండకపోవచ్చన్న అంచనాలతో రాత్రి అమెరికా మార్కెట్ల భారీ లాభాలతో ముగిశాయి. నాస్డాక్ 2.89 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.13 పాయింట్లు పెరిగింది. ఇక డౌజోన్స్ కూడా 1.63 శాతం లాభపడింది. నిన్న రాత్రి 105 దిగువకు వెళ్ళిన డాలర్ ఇండెక్స్ ఇపుడు స్వల్పంగా కోలుకుని 105ని దాటింది. రాత్రి భారీగా క్షీణించిన క్రూడ్ చివర్లో కోలుకుని 97 డాలర్ల పైకి చేరింది. దీంతో ఆసియా మార్కెట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. అమెరికా మార్కెట్ల స్థాయిలో కాకున్నా ఒక శాతంపైగా లాభంతోకీలక మార్కెట్లు ట్రేడవుతున్నాయి. జపాన్ మార్కెట్లకు ఇవాళ సెలవు. హాంగ్‌సెంగ్ 1.32 శాతం లాభంతో ఉంది. అయితే చైనా మార్కెట్లు నామమాత్రపు లాభాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 200 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో…నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుందన్నమాట.