For Money

Business News

లాభాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. డాలర్‌ స్థిరంగా ఉండటం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వల్ల ఈక్విటీ మార్కెట్లకు మద్దతు లభించింది. కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి. రాత్రి నాస్‌డాక్‌ 2.25 శాతం, ఎస్‌ అండ్ పీ 500 1.63 శాతం, డౌజోన్స్ ఒక శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా ఒక శాతం లాభంతో ముగిశాయి. క్రూడ్‌ ఆయిల్‌ స్థిరంగా ఉండటం మరో ప్లస్ పాయింట్‌.ఇక ఆసియా మార్కెట్లన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి. నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిన్న మొన్న భారీగా నష్టపోయిన చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు ఇపుడు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్లి 132 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. బలిప్రతిపాద పండుగ సందర్భంగా ఇవాళ మన మార్కెట్లకు సెలవు.