లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్డాక్ ఒక శాతం క్షీణించగా, డౌజోన్స్ 0.10 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.61 శాతం తగ్గింది. రాత్రి డాలర్ మరింత బలపడింది. డాలర్ ఇండెక్స్ 103ని దాటింది. చైనా వృద్ధి ఆశలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 82 డాలర్లకు చేరువలో ఉంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఒక శాతంపైగా లాభంతో ఉండగా, ఇతర సూచీలు స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.