For Money

Business News

రూ.9.5 లక్షల కోట్ల సంపద ఆవిరి

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడింటి షేర్లు నిన్న కూడా నష్టాలు ముగివాయి. వీటి అదానీ ట్రాన్స్‌మిషన్‌ అత్యధికంగా 10 శాతం పతనమవగా… అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ విల్మర్‌ షేర్లు 5 శాతం చొప్పున క్షీణించాయి. ఇవి లోయర్‌ సీలింగ్‌లో క్లోజయ్యాయి. ఈ షేర్లలో కొనుగోలుదారులు లేరు. ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ మినహా మిగిలిన షేర్లన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా 0.74 శాతం నష్టంతో రూ.1,572.40 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ మాత్రం 9.46 శాతం మేర పుంజుకోగా.. అంబుజా సిమెంట్స్‌ 1.54 శాతం, ఏసీసీ 2.24 శాతం, ఎన్‌డీటీవీ 1.37 శాతం పెరిగాయి. అయినప్పటికీ, గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ మరింత తగ్గింది. హెండిన్‌బర్గ్‌ నివేదిక తరవాత గడిచిన తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో (జనవరి 24 నుంచి ఫిబ్రవరి 6 వరకు) గ్రూప్‌ సంపదలో దాదాపు రూ.9.5 లక్షల కోట్లు ఆవిరైంది.
రుణాల ప్రీపేమెంట్‌
గ్రూప్‌ కంపెనీల షేర్లు తాకట్టుపెట్టి తీసుకున్న 111.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.9,135 కోట్లు) రుణాలను గడువు తీరకముందే చెల్లించనున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గ్రూప్‌ భవితవ్యంపై ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు షేర్ల తనఖా ద్వారా తీసుకున్న రుణ భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారు.