For Money

Business News

స్థిరంగా SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. అమెరికా ఫ్యూచర్స్‌లో ఏమాత్రం మార్పు లేదు. దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. అంతకుమునుపు యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. యూరోస్టాక్స్‌ 50 సూచీ 0.39 శాతం లాభంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అలాగే స్థిరంగా ఉన్నాయి. లాభనష్టాల్లో పెద్ద మార్పులు లేవు. హాంగ్‌కాంగ్‌ సూచీ ఒక్కటే ఒక శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర సూచీలు గ్రీన్‌లో ఉన్నా నామ మాత్రమే. క్రూడ్‌, బులియన్‌ కూడా స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 36 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.