For Money

Business News

బీమా ఏజెంట్ల కమిషన్లపై పరిమితి ఎత్తివేత?

బీమా రంగంలో ఏజెంట్లు, బ్రోకర్లు వంటి మధ్యవర్తులకు చెల్లించే కమీషన్లపై ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. కమీషన్ చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (IRDAI) ఇవాళ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇపుడు కమీషన్ చెల్లింపుపై ఉన్న పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు.అయితే ఈ కమీషన్ ద్వారా చెల్లించే మొత్తాన్ని సంస్థ నిర్వహణ ఖర్చులో భాగంగా పరిగణిస్తామని ఐఆర్‌డీఏ పేర్కొంది. ఇదే సమయంలో IRDAI మరొక ముసాయిదా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం బీమా సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందే పక్షంలో బీమా ఏజెంట్లు, బ్రోకర్ల కమీషన్ గణనీయంగా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, టర్మ్ పాలసీలలో మొదటి సంవత్సరం కమీషన్- మొత్తం ప్రీమియంలో 100% వరకు ఉంటుంది. ప్రీమియం పేమెంట్‌ టర్మ్‌ గనుక పదేళ్ళు దాటే పక్షంలో… టర్మ్ పాలసీలపై మొదటి సంవత్సరంలో వార్షిక ప్రీమియంలో 100% వరకు వసూలు చేయవచ్చు. అయితే రెన్యూవల్‌ ప్రీమియంలపై ఖర్చు 25% వరకు ఉండవచ్చని ముసాయిదాలో పేర్కొన్నారు.
హోల్ లైఫ్, మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీల వంటి సాంప్రదాయ పాలసీల కోసం, బీమాదారులు మొదటి సంవత్సరంలో 80% వరకు, రెన్యూవల్‌ సమయంలో 17.5% వరకు ఖర్చులను వసూలు చేయవచ్చు.