స్వల్పలాభాల్లో SGX నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. దాదాపు ఒకశాతంపైగా నష్టపోయిన డౌజోన్స్ చివర్లో కోలుకుని గ్రీన్‌లోకి వచ్చింది. నాస్డాక్ కూడా భారీ నష్టాల నుంచి తేరుకుని రెండు శాతం నష్టంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.8 శాతం నష్టపోయింది. అమెరికా ఫ్యూచర్స్ ప్రస్తుతం గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లకు కొనసాగింపుగా ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ మాత్రం 0.07 శాతం అంటే నామమాత్రపు నష్టంతో ఉంది. హాంగ్‌సెంగ్ అర శాతం పైగా లాభంతో ఉంది. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా పరిమిత లాభాల్లో ఉన్నాయి. రెండువారాల కనిష్ఠ స్థాయికి అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 33 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి గ్రీన్‌లో లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.